కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయలు

HNK: కాజీపేట మండల కేంద్రంలో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సోమిడి రోడ్డులో కారు, ఆటో వేగంగా ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు వీరిని 108 సర్వీస్‌లో ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.