తేనెటీగల దాడి.. 112 మంది విద్యార్థులకు గాయాలు

తేనెటీగల దాడి.. 112 మంది విద్యార్థులకు గాయాలు

AP: కర్నూలు జిల్లా కోడుమూరు మోడల్‌ స్కూల్‌కు చెందిన సుమారు 112 మంది విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. అప్రమత్తమైన స్థానికులు, ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు డాక్టర్లు గుర్తించారు. వారిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారికి చికిత్స అందించి ఇళ్లకు పంపించినట్లు సమాచారం.