యూడైస్ వివరాలు పక్కాగా నమోదు చేయాలి: కలెక్టర్
GDWL: పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన యుడైస్ వివరాలు ఎప్పటికప్పుడు పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. యుడైస్‌లో అప్డేట్ చేసిన వివరాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు సరిపోలేలా సరి చూడాలన్నారు.