కొడవలి మెడకు తాకడంతో వ్యక్తి మృతి

కొడవలి మెడకు తాకడంతో వ్యక్తి మృతి

MHBD: దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో విషాదం నెలకొంది. ఆయిల్‌ఫామ్ తోటలోకి గెలలు కోయడానికి వచ్చిన ఓ కూలీ తన బైక్‌పై కట్టె కొడవలితో వస్తుండగా.. తుంగతుర్తి మండలం ఎనుకుంటతండాకు చెందిన బానోత్ రమేశ్ (35) ఎదురెదురుగా వస్తుండగా ప్రమాదవశాత్తు కూలీ వద్ద ఉన్న కొడవలి రమేశ్ మెడకు తాకగా, అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చశారు.