పల్లెల నుంచే కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్: KTR

పల్లెల నుంచే కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్: KTR

TG: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన చోట కనీసం 44% సీట్లను దాటకపోవడం ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతకు నిదర్శనమని KTR అన్నారు. ఈ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయన్న ప్రచారం జరిగినా.. రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు విసిగిపోయారని ఫలితాలతో రుజువైందని ట్వీట్ చేశారు. పల్లెల నుంచే ఆ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లు అర్థమవుతోందన్నారు.