VIDEO: 'ఈనెల 20 వరకు పల్లె పండుగ కార్యక్రమం'

VZM: కొత్తవలస మండలంలోని నిమ్మలపాలెం, దేవాడ, గొల్లలపాలెం గ్రామాలలో 41లక్షల రూపాయలతో నిర్మించబోతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి బుధవారం శంకుస్థాపన చేశారు. ముందుగా సీసీ రోడ్డుకు శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ఈనెల 20 వరకు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు.