VIDEO: హత్య కేసులో ఐదుగురు నిందితులు అరెస్టు
SKLM: టెక్కలి M గోపినాథ పురంకి చెందిన కె .పద్మనాభం(36) పై ఈనెల 23 వ తేదీన దాడిచేసి ఆయన మృతికి కారణమైన ఐదుగురు వ్యక్తులను బుధవారం టెక్కలి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సీఐ విజయ్ కుమార్ తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా పద్మనాభంను ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టారన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.