ప్రమాదకరంగా పెదవీడు రహదారి

ప్రమాదకరంగా పెదవీడు రహదారి

SRPT: మఠంపల్లి మండలం పెదవీడు రహదారి కంకర తేలిపోయి లోతైన గుంతలతో ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలకు రహదారి దెబ్బతినడంతో వాహనదారులు ప్రాణభయంతో ప్రయాణించాల్సి వస్తోంది. ఈ రహదారిపై సిమెంట్ లారీలు, భారీ వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి సమీపంలోనే ప్రైమరీ పాఠశాల  ఉన్నప్పటికి సూచిక బోర్డులు లేకపోవడంతో విద్యార్థులు ప్రమాదంలో పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.