'నూతన భవనాలకు ఇంకుడు గుంత తప్పనిసరి'

'నూతన భవనాలకు ఇంకుడు గుంత తప్పనిసరి'

HNK: జిల్లాలో ఇంకుడు గుంతల నిర్మాణాలు సత్ఫలితాలిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 50 వేలకు పైగా ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయింది. నూతనంగా భవన నిర్మాణ అనుమతులు తీసుకున్న సందర్భంలో ఇంకుడు గుంత తప్పనిసరి అని అధికారులు నిబంధన పెట్టారు. ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా వర్షపు నీరు చేరడంతో భూగర్బ జలాలు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.