'పెసా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి'

'పెసా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి'

ASR: ఈనెల 22 నుంచి 26 వరకు కొయ్యూరు మండలం కినపర్తి, రాజేంద్రపాలెం, రేవళ్లులో పెసా కమిటీ కార్యదర్శి, ఉపాధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ఎంపీడీవో ప్రసాదరావు సూచించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో బాబూరావుతో కలిసి ఎన్నికల అధికారులు హెచ్ఎం గోపాలం, ఏఎస్వో చైతన్య, సీడీపీవో దేవమణి, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.