కలెక్టరేట్‌లో కాల్ సెంటర్

PPM: జిల్లాలో యూరియా, ఎరువుల సమాచారం కొరకు కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటరును ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఎరువులు, యూరియాకు చెందిన ఏవైనా సూచనలు, మార్గదర్శకాలు, సమాచారం కొరకు కార్యాలయ పనివేళల్లో (సెలవు రోజులు మినహా) 08963359853 నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.