అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

VZM: జిల్లాలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేద్కర్ ఈ రోజు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని, పారిశుద్ధ్య వ్యవస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. నాగావళి పరివాహక ప్రాంతాలైన సంతకవిటి, రేగిడి, వంగర, ఆర్. ఆముదాలవలస మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.