ఆకతాయిని పట్టుకున్న షీ టీమ్స్ బృందం
NZB: ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతం వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆకతాయిని షీ టీమ్స్ బృందం నిన్న సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితుడిని తదుపరి చర్యల కోసం ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిబ్బంది హెచ్చరించారు.