పెన్షనర్ల నూతన కమిటీ ఏర్పాటు

సత్యసాయి: ఏపీ గవర్నమెంటు పెన్షనర్స్ అసోసియేషన్ హిందూపురం తాలూకా యూనిట్ బుధవారం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. సర్వసభ్య సమావేశంలో గౌరవాధ్యక్షులు కె.సి. జమ్మన్న ఆధ్వర్యంలో తాలూకా నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. సంఘం అధ్యక్షుడిగా యం. శ్రీనివాసులు, కార్యదర్శిగా యం. ఓ.బుళేషు, ట్రెజరర్‌గా వి.ఆదెప్పను, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.