'కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి తీరని అన్యాయం'

వరంగల్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణాకు మరోసారి తీరని అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు తెలిపారు. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నేడు ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏవీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు.