నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్: ఈఈ
చిత్తూరు నగరంలోని గిరింపేట సెక్షన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రామ్ నగర్ కాలనీ, పలమనేరు రోడ్డు, న్యూట్రిన్ ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.