ప్రభుత్వ భవనాల నుండే ప్రజలకు సేవలు:ఎస్పీ

ప్రభుత్వ భవనాల నుండే ప్రజలకు సేవలు:ఎస్పీ

WNP: ప్రభుత్వ కార్యాలయాలను సొంత భవనాల్లో నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో ఉన్న 'భరోసా కేంద్రాన్ని' పాత ఎస్సై నివాస భవనానికి మార్చేందుకు చేపడుతున్న మరమ్మత్తు పనులను ఆమె గురువారం పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.