ఉర్సు ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణ
వరంగల్ నగరంలో ఈనెల 11, 12 తేదీలలో జరగనున్న మాషుక్ రబ్బాని ఉర్సు దర్గా ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఏఎస్పీ అంకిత్ కుమార్ దర్గాను సందర్శించి పోలీస్ బందోబస్తును సమీక్షించారు. కార్యక్రమంలో పీఠాధిపతి నవీద్ బాబా, ఉబేద్ బాబా, 40వ కార్పొరేటర్ మరుపల్ల రవి, 41వ డివిజన్ మైనార్టీ నాయకుడు మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.