కారు ప్రమాదం ఒకరికి గాయాలు
NLG: నార్కట్ పల్లి కామీనేని ఆసుపత్రి సమీపంలో NH-65 హైవేపై వెన్యూ కారు బోల్తాపడి ప్రమాదానికి గురైంది. దీ౦తో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ముందుగా వెళ్తున్న ఆటోను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ గొయ్యిలో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.