బసవేశ్వర జయంతి నిర్వహించాలని వినతి

SRD: ప్రభుత్వపరంగా బసవేశ్వర జయంతి నిర్వహించాలని కోరుతూ వీర శైవ లింగాయత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిద్దేశ్వర్, వర్కింగ్ అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, కోశాధికారి సంతోష్ పాల్గొన్నారు.