సోమందేపల్లి ఎస్సైగా సుధాకర్ యాదవ్ బాధ్యతలు
సత్యసాయి: సోమందేపల్లి మండల నూతన ఎస్సైగా సుధాకర్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు పూలు, పండ్లు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.