నెల్లూరు జిల్లాకు మరోసారి భారీ వర్షం..!

నెల్లూరు జిల్లాకు మరోసారి భారీ వర్షం..!

NLR: జిల్లా వ్యాప్తంగా ఈనెల 29, 30 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో ఈ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు