VIDEO: చందనోత్సవం విజయవంతం: కలెక్టర్
VSP: సింహాచలంలో చందనోత్సవ వేడుకలను మంత్రుల పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. వేకువజాము నుంచే ఏర్పాట్లు పూర్తి చేశామని, మరికాసేపట్లో సహస్రఘటాభిషేకం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో ఉత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు.