కౌలు రైతు సంఘాల మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ
కృష్ణా: గుడివాడ సీఐటీయు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం 4వ మహాసభల పోస్టర్లను సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ సీపీ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో ఉయ్యూరులో ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఆర్ సీపీ రెడ్డి అన్నారు. ఈ మహాసభల్లో కౌలు రైతులు, ప్రజలు, నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.