నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

WGL: ఓ ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన రూ.10వేల నగదును అప్పగించి ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ చాటుకుంది. వివరాల్లోకెళ్తే సోమవారం నర్సంపేట డిపోకు చెందిన బస్సు భద్రాచలం నుంచి హన్మకొండకు వెళ్తుండగా చక్రపాణి అనే ప్రయాణికుడు బస్సులో బ్యాగు మరిచిపోయి దిగి వెళ్ళిపోయాడు. బస్సులో కండక్టర్ రాధిక బ్యాగును చూసి ఆర్టీసీ అధికారులకు అప్పగించగా, తిరిగి ఆ ప్రయాణికుడికి నగదు అందించారు.