ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

ప్రకాశం జిల్లాలో MPP, వైస్ MPP, కో ఆప్షన్ నెంబర్, ఉపసర్పంచ్ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తే, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఎస్పీ ఒంగోలులో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతాలలో 30 యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.