ఏడుపాయల వరదను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

MDK: ఏడుపాయల పరిసర ప్రాంతాలను మెదక్ జాయింట్ కలెక్టర్ నగేశ్ సందర్శించి వరద పరిస్థితిని శనివారం పర్యవేక్షించారు. సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జాయింట్ కలెక్టర్ నగేశ్ తెలిపారు.