ఒకే ఊరిలో 8 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు

ఒకే ఊరిలో 8 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు

KRNL: కౌతాళం మండలం నదిచాగి గ్రామానికి చెందిన 8 మంది ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. హైస్కూల్ కేటగిరిలో వడ్డే నాగరాజు కన్నడ సబ్జెక్ట్‌లో కర్నూలు జిల్లా రెండో ర్యాంక్, తాలూరు స్వాతి సోషల్లో జిల్లా ప్రథమ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. టి.మంజుశ్రీ మ్యాథ్స్‌లో రాణించారు. అలాగే SGT విభాగంలో కె. కావ్య జిల్లా మూడో ర్యాంక్ సాధించారు.