'వచ్చే ఏడాది లోపు కాల్వల నిర్మాణం పూర్తి చేస్తాం'

MBNR: భారీ వర్షాలు కురుస్తున్న ఈ తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు. జడ్చర్ల పట్టణంలో వరద నీటి కాల్వల నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వచ్చే ఏడాది లోపుగా ఈ కాల్వల నిర్మాణం కూడా పూర్తి చేసి రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చూస్తామని చెప్పారు.