పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
CTR: తవణంపల్లి మండలం కొండ్రాజుకాల్వ గ్రామంలో రూ.1.55 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన రోడ్, గార్డెనింగ్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలు మారుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.