నిజాయితీ చాటుకున్న కండక్టర్
JGL: మెట్‌పల్లి నుంచి సిద్దిపేట వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సులో ఓ ప్రయాణికురాలు పూడూరులో బస్సు ఎక్కి తన హ్యాండ్ బ్యాగ్‌ను బస్సులో మరిచిపోయి కరీంనగర్‌లో దిగిపోయింది. బస్ కండక్టర్ సత్తార్, డ్రైవర్ మల్లేశం ఆమె బ్యాగులోని ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి విషయం తెలుపగా మెట్ పల్లి డిపోకు వచ్చిన ఆమెకు బ్యాగును శుక్రవారం అందజేశారు.