నాగార్జున కొండపై పర్యాటకుల సందడి..
PLD: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండ దసరా సెలవుల కారణంగా సందడిగా మారింది.శాంతిసిరి, నాగసి-8, అగస్త్యా లాంచీల్లో వందలాది మంది పర్యాటకులు చేరుకున్నారు. మ్యూజియంలోని బుద్ధుని విగ్రహాలు, రాతిపనిముట్లు, మట్టికుండలు వీక్షించారు. అశ్వమేధ యజ్ఞశాల, శ్రీచైత్యం, శ్రీరంగనాథ ఆలయం దర్శించుకున్నారు. ఎత్తిపోతల జలపాత అందాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి.