'పింఛన్‌ల పంపిణీలో జాప్యం చేస్తే చర్యలు తప్పవు'
ASR: పింఛన్‌ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకూడదని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం రంపచోడవరం ఎస్టీ కాలనీలో పింఛన్‌ల సొమ్ములను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. నగదు పంపిణీలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.