పేద ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే

పేద ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎమ్మెల్యే

NLR: వాకాడు ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ప్రజా సమస్యలు స్వీకరణలో భాగంగా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌లో ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు ఉన్నారు.