తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రకాశం: దోర్నాల మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన కొత్తూరు, గంటవానిపల్లి, ఎడవల్లి, కడపరాజుపల్లి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉన్నత అధికారులతో మాట్లాడి గంటవానిపల్లిలో బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు స్పష్టం చేశారు. వీరి వెంట పలువురు నాయకులు ఉన్నారు.