VIDEO: 'అయ్యా.. నా కుమారుడి ఆచూకీ చెప్పండి'
అన్నమయ్య: తిరుపతిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న తంబళ్లపల్లికి చెందిన జస్వంత్ రెడ్డి అనే విద్యార్థి 4రోజులుగా కనిపించడం లేదని, అతని తల్లి లక్ష్మీదేవి ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 11న హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన జస్వంత్ ఆచూకీ తెలియడం లేదని, తిరుపతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆమె తెలిపారు. పోలీసులు తన కుమారుడిని కనుగొనాలని వేడుకుంటుంది.