పాఠ్యపుస్తకం తొలి పేజీలో 'జయజయహే తెలంగాణ'

పాఠ్యపుస్తకం తొలి పేజీలో  'జయజయహే తెలంగాణ'

TG: రచయిత అందెశ్రీ జ్ఞాపకార్థం స్మృతి వనం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాక, అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం అందించాలని నిర్ణయించింది. ఆయన రచించిన రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ'ను ఇకపై రాష్ట్రంలోని ప్రతి పాఠ్యపుస్తకం మొదటి పేజీలో ముద్రించాలని క్యాబినెట్ తీర్మానించింది.