దేవనకొండలో సీసీ రోడ్లకు భూమిపూజ

KRNL: దేవనకొండ మండలం వెలమకూరు పంచాయతీ సింగాపురంలో ఆదివారం సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. ఎస్సీ కాలనీలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని రూ.5 లక్షల నిధులతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని సర్పంచ్ భాస్కర్ తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.