రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం: సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రెడ్డితో కలిసి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.