నేడు హంద్రీనీవా పనులు పరిశీలించనున్న నిమ్మల

నేడు హంద్రీనీవా పనులు పరిశీలించనున్న నిమ్మల

AP: హంద్రీనీవా వెంబడి పనులను నేడు మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించనున్నారు. హంద్రీనీవా కాలువపై అధికారులు, ఏజెన్సీలతో సమీక్షించనున్నారు. ధర్మవరం, తంబళ్లపల్లి, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో కాలువపై సమీక్ష జరపనున్నారు. ఈ సమీక్షకు నీటిపారుదలశాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, సీఈ,ఎస్‌ఈ, ఈఈ హాజరుకానున్నారు.