కాణిపాకం స్వామివారికి భారీ విరాళం

కాణిపాకం స్వామివారికి భారీ విరాళం

CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకంలో నిత్య అన్నదానానికి తిరుపతి వాసులు శ్రీ కృష్ణమోహన్, పార్థసారథి నాయుడు రూ.2,01,116 విరాళంగా అందించారు. గో సంరక్షణ ట్రస్టుకు బెంగళూరు వాసులు రూ.1,00,016 విరాళంగా అందించారు. వారికి అర్చకులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.