రాచన్న ఆలయంలో జడ్జి ప్రత్యేక పూజలు
SRD: కోహీర్ మండలం బడంపేటలో వెలసిన రాచన్న స్వామి ఆలయంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.అర్జున్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలే కమిటీ సభ్యులు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ విశిష్టత గురించి జడ్జికి వివరించారు. అనంతరం ఆలయ ఆవరణలో పర్యటించారు.