సచివాలయాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
కోనసీమ: అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డ్ సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఇవాళ తనిఖీ చేశారు. సచివాలయం సిబ్బంది హాజరు, ప్రజలకు అందిస్తున్న సేవల నిర్వహణను ఆయన పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించి, ప్రజలకు సకాలంలో నాణ్యమైన సేవలు అందించాలని కమిషనర్ సూచించారు. వాట్సప్ గవర్నెన్స్ ప్రజలు వినియోగించుకునేట్లు చూడాలని ఆదేశించారు.