AP PGCET 2026.. రేపే లాస్ట్
APలోని విద్యాసంస్థల్లో PG కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి AP PGCET 2026కు దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ రోజు. ఈ పరీక్షతో MA, MSc, MCom, MCJ, MLISc, MEd, MPEd తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. సంబంధిత కోర్సులో అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు OCలకు రూ.850, BCలకు రూ.750. SC/STలకు రూ.650. ఏప్రిల్ 20న హాల్ టికెట్ల విడుదల.. మే 5-11 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.