GPO మండల అసోసియేషన్ ఏకగ్రీవం
VKB: దుద్యాల మండల GPOల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని నిన్న జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండలాధ్యక్షుడుగా కే. శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ఆర్. రమేశ్, కార్యదర్శిగా ఎం.నర్సింలు సభ్యులుగా బి. పకీరప్ప ఎన్నికయ్యారు. అనంతరం తహశీల్దార్ కిషన్, ఇటీవల జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్‌ను సన్మానించారు.