జక్రాన్ పల్లి ఉప సర్పంచ్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి
NZB: జక్రాన్ పల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నట్ట భోజన్న విజయం సాధించారు. నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బండి పద్మ సర్పంచిగా గెలుపొందగా ఉపసర్పంచ్ ఎన్నిక సోమవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. మొత్తం 8 మంది వార్డు సభ్యుల మద్దతుతో నట్ట భోజన్న ఉపసర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు.