ఆఫీసులోనే మద్యం తాగిన ఉద్యోగి.. వీడియో వైరల్

ఆఫీసులోనే మద్యం తాగిన ఉద్యోగి.. వీడియో వైరల్

కర్నూలు R&B కార్యాలయంలో ఓ ఉద్యోగి డ్యూటీ సమయంలోనే మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక సీనియర్ అసిస్టెంట్ తన ఛాంబర్లో మద్యం తాగుతూ కనిపించారు. ఈ ఘటనపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత పెద్ద శాఖలో ఇలాంటి ఘటన జరగడంతో 'ఉన్నతాధికారులు ఏం చూస్తున్నారు' అంటూ ప్రశ్నిస్తున్నారు.