మీర్జాగూడ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

మీర్జాగూడ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

MLG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గ్రామంలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారి పై టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 24 మంది మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన, గాయపడిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.