'అత్యవసరమైతేనే ప్రయాణాలు కొనసాగించాలి'
NRML: గల్ఫ్ దేశాలకు కార్మికులు అత్యవసరమైతేనే ప్రయాణాలు కొనసాగించాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వచ్చేవారు, పోయేవారు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. యుద్ధం దృష్ట్యా ఏజెంట్లు పెద్ద మొత్తంలో విమాన చార్జీలను వసూలు చేసే అవకాశం ఉందన్నారు.