విజయవాడలో నకిలీ అధికారులు అరెస్ట్

విజయవాడలో నకిలీ అధికారులు అరెస్ట్

NTR: విజయవాడలో నలుగురు నకిలీ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. పటమటలో కిరాణా దుకాణానికి వెళ్లిన నలుగురు యువకులు తాము క్రైమ్ గ్రీవెన్స్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చామని చెప్పి తనిఖీలు చేశారు. సరకుల నాణ్యత లేదని, బరువు తక్కువగా ఉందని చెబుతూ నగదు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.